Header Banner

ముదురుతోన్న వాణిజ్య యుద్ధం.. చైనాకు ట్రంప్ మరో వార్నింగ్.. 24 గంటల డెడ్ లైన్!

  Tue Apr 08, 2025 15:07        U S A

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోమారు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాపై విధించిన 34 శాతం ప్రతీకార సుంకాలను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. 24 గంటల్లో ప్రతీకార సుంకాలను రద్దు చేయకుంటే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో ఓ పోస్టు పెట్టారు. ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై పెద్దమొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఇటీవల విదేశాలపై టారిఫ్ లు విధించారు. ఇందులో భాగంగానే చైనాపైనా 34 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ అమెరికాపైనా అంతే మొత్తంలో (34 శాతం) ప్రతీకార సుంకాలను విధించింది. ఈ నెల 10 నుంచి ఈ టారిఫ్ లు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రతీకార సుంకాలను విధించాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని చైనాను హెచ్చరించారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #USA #Trump #24Deadline #China #Issues